వివాహేతర సంబంధం: సింగపూర్ స్పీకర్ రాజీనామా

తాను తప్పు చేశానని, తన ప్రవర్తన నీతిబాహ్యమని, దాని ప్రభావం తమ పీపుల్స్ యాక్షన్ పార్టీ మీద, పార్లమెంటు మీద పడకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు పామర్ ప్రకటించారు. పీపుల్స్ అసోసియేషన్‌గా పిలిచే కమ్యూనిటీ ఆర్గనైజేషన్ స్టాఫ్ మెంబర్‌తో తనకు సంబంధం ఉందని పామర్ వెల్లడించారు. అందుకు తన మద్దతుదారులకు తీవ్ర విచారం తెలియజేస్తున్నట్లు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
అసోసియేషన్ చైర్మన్‌గా ప్రధానీ లీ సీన్ లూంగ్ వ్యవహరిస్తున్నారు. పామర్ రాజీనామాను వెంటనే అంగీకరించారు. పామర్‌తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ ప్రధాన మంత్రి టియో చీ హీన్ రాజకీయ నాయకుడి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పారు.
పామర్ స్థానంలో జరిగే ఉప ఎన్నికపై ఏ విధమైన ప్రకటన కూడా వెలువడలేదు. సింగపూర్ చట్టం కింద ఉప ఎన్నిక అనేది ప్రధాని విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షంపై నైతిక ఆధిక్యత సాధించిన పీపుల్స్ యాక్షన్ పార్టీపై ఆన్‌లైన్ విమర్శలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications