హేట్ స్పీచ్: మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఇంటికి నోటీసులు

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈ నెల 7వ తేదిన నిర్మల్ పోలీసు స్టేషన్‌లో, 8వ తేదిన నిజామాబాద్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసులలో సూచించారు. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ చికిత్స నిమిత్తం ఇంగ్లాండులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు నేరుగా ఇవ్వలేక ఇంటికి నోటీసులు అందజేశారు.
మరోవైపు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ అదిలాబాద్ జిల్లా బోథ్‌లో పలు సంస్థలు బందుకు పిలుపునిచ్చాయి. ఈ బందు శుక్రవారం కొనసాగుతోంది. బోథ్‌లోని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా మూతపడ్డాయి. పోలీసులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. అతనిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశాయి. ఆయనను అరెస్టు చేస్తామని డిజిపి దినేష్ రెడ్డి గురువారం చెప్పారు. ఆయన ఇంగ్లాండులో ఉన్నారని, అవసరమైతే ఇంటర్ పోల్ సాయంతో అరెస్టు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications