రేప్ యత్నం: కాంగ్రెస్ లీడర్‌కు దేహశుద్ది, వస్త్రాపహరణం

విక్రం సింగ్ కాంగ్రెసు నేత. అతను బక్సా జిల్లాలోని సపగురి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అతను ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నాడు. విక్రం పైన అత్యాచార యత్నం ఆరోపణలు వచ్చాయని, దీనిపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అసోం పోలీసులు చెబుతున్నారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతనిని అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే అతను ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉన్నారని చెప్పారు.
మరోవైపు బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా కలెక్టర్ ప్రతిమ ఎస్.వర్మ కథనం ప్రకారం- డార్జిలింగ్ నుంచి ఒక యువతి (30) దిబ్రూగఢ్-ఢిల్లీ బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తోంది. బీహార్‌లోని జగ్జీవన్‌స్టేషన్ వద్ద ఇద్దరు ఆర్మీ జవాన్లు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. వారినుంచి తప్పించుకునే యత్నంలో ఆమె రైల్లోంచి దూకేయడంతో తలకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి.
కేరళలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్యచేసిన ఆటో డ్రైవర్ రాజేష్‌కుమార్ (28)కు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి బి.సుధీంద్ర కుమార్ గురువారం మరణ శిక్ష విధించారు. గత మార్చి 6న ఒకచోట ఆటో ఆగిపోవడంతో రిపేరు కోసం స్క్రూ డ్రైవర్ కావాలంటూ ఇతడు పక్కనే ఉన్న ఇంటివద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా చదువుకుంటున్న బాలికను గమనించి, ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత గొంతునులిమి ప్రాణం తీయడమే కాకుండా బాలిక మెడలోని బంగారు గొలుసు పట్టుకుపోయాడు. కోర్టు అతడికి ఉరిశిక్ష విధించడంపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications