వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజాకార్ల వారసుడు: అక్బరుద్దీన్ ఓవైసీపై దత్తాత్రేయ

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP Logo
హైదరాబాద్‌: ద్వేషపూరిత ప్రసంగం చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విరుచుకుపడ్డారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌ను ఎక్కడున్నా అరెస్టు చేయాలని బిజెపి నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌పై సామాన్యులు కోర్టులను ఆశ్రయించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. అక్బరుద్దీన్ రజాకార్ల వారసుడని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్బరుద్దీన్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి నేత డాక్టర్ కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్బరుద్దీన్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కాగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎబివిపి కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్బరుద్దీన్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అక్బరుద్దీన్‌కు కోర్టుల ఆదేశాల మేరకు పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయితే, చికిత్స నిమిత్తం అక్బరుద్దీన్ లండన్‌లో ఉన్నట్లు ఆయన సోదరుడు, మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.

English summary
BJP senior leader Bandaru Dattatreya has lashed out at MIM MLA Akbaruddin Owaisi opposing his hate speech. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X