శ్రీరామ్ ఎపిసోడ్: పరిటాల ఫ్యామిలీపై సుధాకర్ ఫిర్యాదు

పరిటాల కుటుంబసభ్యులు, వారి అనుచరులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, గతంలో కూడా నాగూర్‌హుస్సేన్ సహాయంతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు బాలాజీ, అతడి డ్రైవర్ వెంకట్, మౌలా, మరికొంతమంది మారణాయుధాలతో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, దీనికి సంబంధించి వారిపై పోలీసు కేసు కూడా నమోదైందని వివరించారు.
తర్వాత కూడా పరిటాల కుటుంబ సభ్యులు, వారి అనుచరులు తనను అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని డీఎస్పీకి అందజేసిన వినతి పత్రంలో ఆయన చెప్పారు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తనలాంటి వారిని అంతమొందించి భయాందోళనలు సృష్టించడం ద్వారా ధర్మవరం ప్రాంతంలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై డీఎస్పీ నవాబ్‌జాన్ స్పందిస్తూ, పరిటాల కుటుంబం నుంచి, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని సుధాకర్‌రెడ్డి విన్నవించారని, పరిశీలించి తగిన చర్యలు చేపడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications