వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోరేన్ మద్దతు ఉపసంహరణ: మైనారిటీలో ముండా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jharkhand
రాంచీ: శిబూ సొరేన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) మద్దతు ఉపసంహరించుకోవడం బిజెపి నాయకత్వంలోని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడింది. మిత్రపక్షాల నాయకత్వ మార్పు డిమాండ్‌ను ప్రధాన మిత్రపక్షమైన బిజెపి అంగీకరించలేదు. మిత్రపక్షాలతో 28 నెలల చొప్పున అధికారం పంచుకోవడానికి బిజెపి అంగీకరించింది. దాంతో ఇప్పుడు తమకు అధికారం అప్పగించాలని జెఎంఎం డిమాండ్ చేస్తోంది.

గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడేందుకు బిజెపి నిరాకరించింది. ముఖ్యమంత్రి అర్జున ముండా రాజీనామాకు జెఎంఎం డిమాండ్ చేసింది. కానీ ముండా జెఎంఎం డిమాండ్‌ను తిరస్కరించింది. ముండా స్థానంలో ముఖ్యమంత్రి పదవిని మరో బిజెపి నేతకు అప్పగించాలనే డిమాండ్‌ను కూడా అంగీకరించలేదు.

పైగా ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయవద్దని ముండా జెఎంఎంను కోరారు. జార్ఖండ్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, గత రెండేళ్లలో ప్రతిష్టను పెంచడానికి తాను ఎంతగానో కృషి చేశానని, తాను మంచి ఫలితాలు సాధిస్తున్నానని, ఆ కృషిని కొనసాగించాలని తాను అనుకుంటున్నానని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అది అవసరమని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం జెఎంఎం సోమవారం పట్టుబట్టింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత శిబూ సొరేన్ తుది నిర్ణయం తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ చెప్పారు.

జార్ఖండ్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 81 కాగా, బిజెపికి 18 మంది సభ్యులున్నారు. అంతే మంది ఎమ్మెల్యేల బలం జెఎంఎంకు ఉంది. ఆరుగురు సభ్యులు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడానికి సిద్ధంగా లేరు.

English summary
The BJP-led government in Jharkhand was left in a minority after Jharkhand Mukti Morcha (JMM) today withdrew support as the ruling party did not agree to its main ally's demand of a leadership change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X