అక్బర్ అరెస్టుపై ఉత్కంఠ: గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన

MIM workers protest at Gandhi hospital
హైదరాబాద్: ద్వేషపూరిత ప్రసంగం చేసిన మజ్లీస్ అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్టు చేస్తారా, ఇంటికి పంపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో హైడ్రామా కొనసాగుతోంది. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. వరంగల్ రేంజ్ ఐజి వెంకటేశ్వర రావు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.

వైద్య పరీక్షలు పూర్తయినందు వల్ల తాను ఇంటికి వెళ్లిపోతానని అక్బరుద్దీన్ చెప్పారు. దానికి పోలీసులు నిరాకరించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు ఉండాలని వారు సూచించారు. దీంతో పోలీసులతో అక్బరుద్దీన్ వాదనకు దిగారు. ఆయనను పోలీసులు ఆస్పత్రిలోని రెండో విశ్రాంతి గదికి తరలించారు. సీటీ స్కాన్ తప్ప మిగతా పరీక్షలన్నింటిలో అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు తేలింది.

ఇదిలా వుంటే, హైదరాబాద్‌లో అక్బరుద్దీన్ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్‌ను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆస్పత్రి పరిసరాల చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఆస్పత్రి పరిసరాల్లో మజ్లీస్ కార్యకర్తలు వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. మజ్లీస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అటు పాతబస్తీలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. గుంపులు గుంపులుగా తిరుగొద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+