వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై చెప్పలేదు, హైదరాబాద్ చర్చించలేదు:షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ ఇస్తామనో ఇవ్వమనో తాము చెప్పలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం అన్నారు. మంత్లీ రివ్యూలో భాగంగా శాస్త్రి భవనంలో షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అంశంపై స్పందించారు. గత డిసెంబర్ 28న అఖిల పక్ష సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు చెప్పింది తాము విన్నామని అన్నారు. తాము చెప్పాల్సింది త్వరలో చెప్తామన్నారు.

నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పామన్నారు. అంతేకానీ ఇస్తామనో ఇవ్వమనో తాము చెప్పలేదన్నారు. సమస్య పరిష్కారానికి గడువు ఉందన్నారు. ఆ లోగా తేల్చుతామన్నారు. నెలలోగా అన్న తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణ అంశంపై చాలామంది నుండి సమాచారం వస్తోందన్నారు. తాను కూడా వివరాలు తెలుసుకుంటున్నానని చెప్పారు. తెలంగాణపై సమాచారాన్ని పరిశీలిస్తున్నామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అంశంపై చర్చించలేదన్నారు.

మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలను పరీక్షించామన్నారు. ఢిల్లీలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళలకు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు నైట్ పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పెంచామని షిండే చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల పైన గస్తీ చర్యలు చేపట్టామన్నారు.

భద్రతా చర్యల కోసం మాజీ సైనికులు, ఎన్జీవోల సేవలు వినియోగించుకుంటున్నామని చెప్పారు. నక్సల్స్ తరుచూ తమ దాడి వ్యూహాలను మార్చుకుంటున్నారన్నారు. వారి దాడి వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మహిళలు, అమ్మాయిలు పాఠశాలలు, కళాశాలలు పూర్తైన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్న అంశాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

English summary
Central Home Minister Sushil Kumar Shinde has responded on Telangana issue on Thursday. He said we have time to clarify Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X