వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 ఏళ్లుగా షర్మిల దీక్ష, నీది: కెసిఆర్‌పై గోనె నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ కోసమంటూ దొంగ దీక్ష చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు ఆదివారం అన్నారు. మణిపూర్‌కు చెందిన షర్మిల అనే మహిళ పన్నెండేళ్లుగా నిరాహార దీక్ష చేస్తోందని ఆయన గుర్తు చేశారు. నవంబర్ 2012 నాటికి ఆమె దీక్ష పుష్కరాన్ని పూర్తి చేసుకుందన్నారు.

ఆమెకు ఫ్లూయిడ్స్‌‍ను ఎక్కిస్తున్నారన్నారు. కాని కెసిఆర్ మాత్రం దొంగ దీక్షలతో ప్రభుత్వాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. ఆయన దీక్షపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ ఎప్పుడు వచ్చిందో ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. 2009లో రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం వద్దని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు దానికోసం ఎందుకు పట్టుబడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అందులోని గూడార్థమేమిటన్నారు.

తెరాస, కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెసు పార్టీయే ప్రధాన శత్రువు అని చెప్పిన కెసిఆర్ రెండో ఎస్సార్సీకి ఒప్పుకొని కాంగ్రెసుతో అప్పుడు పొత్తు కుదుర్చుకున్నారని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని చెప్పలేదన్నారు. కానీ కెసిఆర్ ఆ పార్టీపై కాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు.

తెలంగాణపై నిర్ణయం కేంద్రానిదే అన్నారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తామని తమ పార్టీ స్పష్టంగా చెప్పిందన్నారు. ఇంకా తెరాసకు అభ్యంతరమేమిటన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికెత్తింది కెసిఆరే అని అలాగే దానిని నిర్వీర్యం చేసిందీ అతనే అని ఆరోపించారు. కెసిఆర్ ఇప్పటికైనా తన తప్పులు సరిదిద్దుకొని ఉద్యమాన్ని సహేతుకంగా ముందుకు నడిపించాలని సూచించారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కెసిఆర్ మధ్య ఉన్న ఒప్పందాలు బయట పెట్టాలన్నారు. కాంగ్రెసు, తెరాస కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కేబినెట్ నిర్ణయాలు రహస్యమని తెలంగాణ అంశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అన్నారని, రాష్ట్ర విభజనపై రహస్యం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అందర్నీ కలుపుకొని పోతేనే తెలంగాణ సాధ్యమని కెసిఆర్‌కు గోనె ఓ లేఖ రాశారు.

English summary

 YSR Congress leader Gone Prakash Rao has lashed out at TRS Chief K Chandrasekhar Rao on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X