మెగా కోడలికి వేధింపులు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు!
సోషల్ మీడియాలో సెలబ్రెటీల మీద వస్తున్న ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ అన్ని ఇన్ని కాదు. ఏ చిన్న అవకాశం దొరికినా సెలబ్రిటీల పైన అసభ్యకరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు కొందరు. ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయితే వారి పైన జరిగే దుష్ప్రచారానికి అంతే లేకుండా పోతుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు.
లావణ్య త్రిపాఠిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు
తాజాగా వరుణ్ తేజ్ సతీమణి మెగా బ్రదర్ నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి ఆన్లైన్లో వేధింపులను, అసభ్యకరమైన వ్యాఖ్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె ఇక భరించలేనని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా కొందరు మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి లక్ష్యంగా చేసుకొని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె పైన వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు.

పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు
ఆమెను ట్రోల్ చేయడం మాత్రమే కాకుండా, ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరంగా చిత్రీకరించడం, అసత్య ప్రచారాలను చేయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని సహించలేని స్థితిలో లావణ్య త్రిపాటి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పైన తన కుటుంబ సభ్యుల పైన సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని ఆపై తప్పుడు కామెంట్లతో దూషిస్తున్నారు అని లావణ్య త్రిపాఠి పోలీసులకు తెలిపారు.
అతడిని పట్టుకోమని లావణ్య విజ్ఞప్తి
కొంతకాలంగా తనపైన ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని లావణ్య త్రిపాఠి వాపోయారు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని చెప్పారు. పర్పుల్ క్రెయాన్ 00 insta ఖాతాకు సంబంధించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వేధింపులకు పాల్పడుతున్న youtube ఐడీలు, థంబ్ నెయిల్స్ , ఎక్స్ హ్యాండిల్స్, insta హ్యాండిల్స్ తదితర వివరాలను ఆమె పోలీసులకు అందించారు.
కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దీంతో లావణ్య త్రిపాటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 67 తో పాటుగా భారత న్యాయ సంహిత 78, 79 కింద కేసు నమోదు చేశారు . లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు పోలీసులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications