వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి ఒఎంసి కేసు: రాజగోపాల్‌కు బెయిల్ మంజూరు

By Pratap
|
Google Oneindia TeluguNews

MD Rajagopal
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో నిందితుడైన గనుల శాఖ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్‌కు నాంపల్లి సిబిఐ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రాజగోపాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ప్రతి మంగళ, శుక్రవారాల్లో సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని కూడా ఆదేశించింది.

రూ. 50 వేల రూపాయల విలువ చేసే రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని కోర్టు రాజగోపాల్‌ను ఆదేశించింది. గతంలో కొద్ది రోజులు బెయిల్‌పై రాజగోపాల్ బయట ఉన్నారు. గతంలో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. రాజగోపాల్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజగోపాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఏడాదికి పైగా జైలులో ఉన్నారు.

ఒఎంసి కేసులో రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు 2011 నవంబర్ 12వ తేదీన అరెస్టు చేశారు. ఇన్నాళ్లకు ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా సస్పెన్షన్‌కు గురైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాన్ని పొడగించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన మైనింగ్ కేసులో మాజీ గనుల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ ఎండి రాజగోపాల్‌లపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని ఎ-3గా, రాజగోపాల్‌ను ఎ-4గా చేర్చారు.

English summary
Nampally CBI court has granted conditional bail to formed mines MD Rajagopal, accused in Karnataka former minister Gali Janardhan Reddy's ONC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X