• search

మా వెనుక కెవిపి పిచ్చిమాటలు: కెకె, యాష్కీ డుమ్మా

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Madhu Yashki-K Keshav Rao
    హైదరాబాద్: తమ వెనుక రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఉన్నారనేవి పిచ్చి వ్యాఖ్యలు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కేశవరావు గురువారం అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే తాము పార్టీలో ఉండలేమని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఖరాఖండిగా చెప్పేసినట్లు చెప్పారు. ఎంపీలమందరం కలిసే ఉన్నామన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

    నిన్న సాయంత్రం పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో నుండి వచ్చిన ప్రకటన సంతోషాన్ని కలిగించినా, రాజీనామాలకే కట్టుబడి ఉన్నామన్నారు. తమతో మధుయాష్కీ ఒక్కరే విభేదించారన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు రాజీనామాలు సరికాదని ఆయన అభిప్రాయమని, ఆయన తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. ఒక్క రాజీనామా విషయంలో మాత్రం ఆయన మాటలు వ్యక్తిగతం అన్నారు.

    అధిష్టానంలో తెలంగాణ పట్ల పాజిటివ్‌నెస్ కనిపిస్తోందన్నారు. రాజ్యాంగ ప్రాసెస్ పూర్తి చేసే పనిలో ఉన్నామని చెప్పడం సంతోషకరమన్నారు. అయితే తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు తాము రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని, తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కేంద్రం, అధిష్టానంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ప్రజలు నమ్మే వరకు తాము రాజీనామాకు కట్టుబడి ఉంటామన్నారు.

    నెల రోజుల్లో తెలంగాణ తేల్చుతామన్న కేంద్రం ఆ తర్వాత మాట తప్పిందన్నారు. అందుకే కాంగ్రెసును ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు వ్యక్తిగత పనుల వల్ల భేటీకి హాజరు కాలేదని చెప్పారు. మీడియా తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందన్నారు. వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎంపీలందరూ రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.

    తాము స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలను సమర్పించామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. వేరే పార్టీలో చేరేందుకు రాజీనామాలు చేయలేదన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ రాదని మేమే చెప్పామని కానీ, ప్రజల కోరిక మేరకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాజీనామాలతో అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. షిండే మాట తప్పడం, ఆజాద్ నిర్లక్ష్యపు మాటలు తమను బాధించాయన్నారు. కేవలం రాజీనామా విషయంలోనే యాష్కీతో విభేదించామన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఆధిష్టానంతో పోరాటం చేస్తామన్నారు. కాగా ఈ భేటీకి మధుయాష్కీ రాలేదు.

    English summary
    Congress Party senior leader K Keshav Rao said on Thursday that KVP Ramachandra Rao is not behind Telangana MPs.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more