మరో చిక్కు: అసద్‌కు ఔరంగాబాద్ పోలీసుల సమన్లు

Asaduddin Owaisi
హైదరాబాద్‌ : మజ్లీస్ అధినేత‌, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఇంట్లో ఔరంగాబాద్‌ పోలీసులు బుధవారం తనిఖీలు చేశారు. మజ్లలీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ అనుచిత వ్యాఖ్యల క్రమంలో ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.

ఔరంగాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించిన అసదుద్దీన్‌కు ఆ ప్రాంత పోలీసులు స్వయంగా సమన్లు అందజేశారు. ఫిబ్రవరి1న ఔరంగాబాద్‌లో బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని అసదుద్దీన్ ఔరంగాబాద్‌ కమిషనర్‌ను కోరారు. అసదుద్దీన్ విజ్ఞప్తిని ఆయన అనుమతించలేదు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి చివరి వరకు ఎలాంటి సభలకు అనుమతివ్వమని ఔరంగాబాద్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.

రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు అసదుద్దీన్‌కు ఆయన నోటీసులు ఇచ్చారు. ఔరంగాబాద్‌ రావొద్దని ఆయన అసదుద్దీన్‌రు సూచించారు. అయితే పోలీసు సమన్లు జారీ చేయడంపై కోర్టులోనే తేల్చుకుంటామని అసదుద్దీన్ చెప్పారు.

ఔరంగాబాద్ పోలీసులు బుధవారం హైదరాబాదులోని నారాయణగుడా పోలీసుల సహకారంతో అసదుద్దీన్ నివాసానికి వెళ్లారు. అసదుద్దీన్ నివాసం నారాయణగుడా పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+