పాత సీసాలో కొత్త సారా: జగన్, చంద్రబాబు యు టర్న్!

Chandrababu Naidu - YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పొత్తులు లేదా ఎన్నికల తర్వాత కలయిక కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పొత్తు ఎత్తులపై గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ చంద్రబాబుపై కొత్తగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఆదివారం బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. ఆయన సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ బిజెపి వైపుకు రాడనే పక్కా సమాచారం కారణంగానే ఆయన ఆరోపణలు చేసి ఉంటారని అంటున్నారు. దీంతో జగన్ కాంగ్రెసుతో చేతులు కలపడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుతం తనకు అనుకూలంగా ఉండటంతో ఎన్నికల ముందు కాకుండా ఎన్నికల తర్వాతనే జగన్ కాంగ్రెసుతో దోస్తీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు. జగన్ - కాంగ్రెసు దోస్తీ కడతారని ఇతర పక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీలోని కొందరు నేతలు కూడా జగన్ ఎప్పటికైనా తమ పార్టీలోకి వస్తారని జోస్యం చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ బయటకు రావాలంటే ప్రతిగా ఆయన కాంగ్రెసుతో చేతులు కలపక తప్పని పరిస్థితి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక చంద్రబాబు తన పాత మిత్ర పార్టీ అయిన బిజెపితో దోస్తీ చేస్తాడా? అనే ప్రశ్న తొలుస్తోంది. బాబు ఇటు కాంగ్రెసు, అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసే ప్రసక్తి లేదు. మరోవైపు సిపిఐ సీమాంధ్రలో టిడిపితో కలుస్తామని చెప్పినప్పటికీ తెలంగాణలో తెరాసతో కలుస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో బాబు కూడా వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయకున్నా ఆ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు.

టిడిపితో దోస్తీకి బిజెపి సిద్ధంగా ఉందనే చెప్పవచ్చు. కానీ, మైనార్టీలు దూరమవుతారేమోననే అభిప్రాయంతో చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. బాబు విముఖత చూపడంతో బిజెపి కూడా పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. అయితే, జగన్ పైన ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు కొత్త పొత్తులకు తెరదీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎన్‌విఎస్ఎస్ వ్యాఖ్యలు 2014లో బిజెపి, టిడిపిల పొత్తుకు సంకేతాలు కావొచ్చునని వైయస్సార్ కాంగ్రెసు అనుమానాలు వ్యక్తం చేసింది.

వరుసగా రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణ, జగన్‌ల కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పార్టీ క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ 2014లో ఎన్నికలు హోరా హోరీగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే టిడిపికి మెజార్టీ రానిపక్షంలో తెలంగాణలో ఇటీవల పుంజుకుంటున్న బిజెపితో ఎన్నికల తర్వాత పొత్తుకు సై అనే అవకాశాలు లేకపోలేదంటున్నారు. జగన్ ఐనా, బాబు ఐనా ఈ పొత్తులను ఎన్నికల తర్వాతకే వాయిదా వేస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+