వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై రషీద్ అల్వీ మాట అదే: సున్నితమైంది

By Pratap
|
Google Oneindia TeluguNews

Rashid Alvi
న్యూఢిల్లీ: తెలంగాణపై ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ పాత పాటే పాడారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సంప్రదింపులు జరిపిన తర్వాత సాధ్యమైనంత త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు తెలియజేస్తామని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలు తనకు తెలియవని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడిన విషయాలను వెల్లడించలేమని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ ఏర్పాటు కోసం తమ పార్టీ అధిష్టానం సంప్రదింపులు, కసరత్తు జరుపుతున్న సమయంలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలు, రాజీనామాల బెదిరింపుల పేరిట అడ్డుకోవడం తగదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే అంశం తుది దశలో కొంత మంది ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన బుధవారం హైదరాబాదులో మీడియాతో అన్నారు.

తెలంగాణ కోసం యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. తెలంగాణ రావడం తథ్యమని, భువనగిరి సభలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.

English summary
AICC spokesperson Rashid Alvi said that Telangana is a sensitive issue and the consultations are going on to solve the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X