'ప్రభాకర్, బాబులపై బ్రదర్ పరువు నష్టం': జాన్ ఖండన

బ్రదర్ అనిల్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బాబు, ప్రభాకర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బ్రదర్ అనిల్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై బ్రదర్ అనిల్ న్యాయ పోరాటం చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అనిల్ కుమార్‌కు చెందిన లావాదేవీలు అన్నీ పారదర్శకంగానే ఉన్నాయని ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
30 ఏళ్ల రాజకీయ జీవితం గల చంద్రబాబు నిరాశ, నిస్పృహకు లోనై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత సోదరి పాదయాత్ర చేస్తండటంతో ఓర్వలేక ఆమె భర్త అనిల్ కుమార్ పైన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చర్చి భూమితో, హెలికాప్టర్ కుంభకోణంతో, రక్షణ స్టీల్స్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పడం విడ్డూరమన్నారు. అనిల్‌కు వీటితో ఉన్న సంబంధమేంటో చెప్పాలన్నారు.
నిరాధార ఆరోపణలు: పాస్టర్ జి.జాన్
క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్‌పై బిజెపి నేత ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలను క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పాస్టర్ జి.జాన్ తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications