• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభాకరన్ కొడుకు హత్య: కాళిలా మారిన జయలలిత!

By Srinivas
|
Jayalalithaa
చెన్నై: ఎల్‌టిటిఇ అధిపతి ప్రభాకరన్ చిన్న కుమారుడు బాలచంద్రన్ హత్యపై తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత బుధవారం ఘాటుగా స్పందించారు. శ్రీలంక ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. శ్రీలంక అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శ్రీలంక పాశవిక చర్యకు నిదర్శనం అన్నారు. బాలచంద్రన్ హత్యను ఆమె ఖండించారు. శ్రీలంకను అంతర్జాతీయ కోర్టులో నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది యుద్ధ నేరమన్నారు.

బ్రిటిష్ టివి ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ పైన ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. ఇతర దేశాలతో కలిసి మన కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వ దమననీతిని అంతర్జాతీయ కోర్టుకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఇది అమానవీయ చర్య అన్నారు. ప్రభాకరన్ తనయుడు చిన్నవాడు అని, బాలుడిని కర్కశంగా చంపడమేమిటన్నారు. ఈ చర్య పైన మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ తదితర సంస్థలు కూడా ఖండించాయి.

ప్రభాకరన్ తనయుడు బాలచంద్రన్‌ను తాము కిరాతకంగా హతమార్చామనే ఆరోపణలు అవాస్తవమని శ్రీలంక ప్రభుత్వం ఖండించింది.

కాగా, ఎల్టిటిఇ అధినేత ప్రభాకరన్ మరణం తర్వాత చాలా కాలానికి అత్యంత ఆశ్చర్యానికి, గగుర్పాటుకు గురి చేసే కొన్ని చిత్రాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంక సైన్యం కిరాతకాన్ని చూపించే దారుణమైన చిత్రాలు వెలుగు చూశాయి. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్‌ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు బయటకు వచ్చాయి.

బాలచంద్రన్‌కు సంబంధించిన కొన్ని ఛాయాచిత్రాలను చానెల్ 4 మరోసారి ప్రచురించింది. ఇసుక సంచులు నింపిన టెంట్ కింద శ్రీలంక సైన్యం ఆపరేట్ చేసిన బాలచంద్రన్ కూర్చున్న ఛాయాచిత్రాలను ఆ చానెల్ ప్రచురించింది. అంతకు ముందు ఇదే చానెల్ బాలుడి శరీరంపై బుల్లెట్ తూటాల తూట్లు గల చిత్రాలతో కూడిన వీడియోను ప్రసారం చేసింది. మృతి చెందిన పడి ఉన్న అంగరక్షకుల మధ్య పడి ఉన్న బాలచంద్రన్‌ను ఆ చానెల్ చూపించింది.

బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో మరణించాడని శ్రీలంక సైన్యం ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుత ఛాయాచిత్రాలతో శ్రీలంక సైన్యం ప్రవర్తనను, వ్యవహార శైలిని బయటపెడుతోంది. బంకర్‌లో కూర్చున్న బాలచంద్రన్‌ను శ్రీలంక ఆర్మీ పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2009లో ఎల్టిటిఇని అంతం చేయడానికి శ్రీలంక ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఈ చిత్రాలను తీశారు. బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో చనిపోలేదని చెప్పడానికి ఈ ఫొటోలు చక్కటి ఉదాహరణలని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A series of chilling photographs showing Balachandran, the 12-year-old son of LTTE chief Velupillai Prabhakaran, before and after he was shot dead in 2009, towards the end of the decades-long civil war in Sri Lanka, has triggered an outcry in Tamil Nadu. There was all-round condemnation with political parties stepping up pressure on the UPA government to rework its diplomatic ties with the island nation's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more