మహిళా టెక్కీ గొంతు కోసిన భర్త, ఆత్మహత్యాయత్నం

ఐటి కంపెనీ కార్యాలయంలోనే భార్య గొంతును కత్తితో కోసి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. ఇరువురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
పథకం ప్రకారమే ఆ వ్యక్తి కార్యాలయానికి వచ్చాడని అర్థమవుతోందని, పాకెట్ నైఫ్‌తో అతను కార్యాలయానికి వచ్చాడని, ఇరువురి మధ్య తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుందని, ఆ తర్వాత అతను ఆమె గొంతు కోశాడని పోలీసులు చెప్పారు.
మహిళా టెక్కీ భర్త ఏం చేస్తున్నాడనేది తెలియదని, పెళ్లయిన సమయంలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడని పోలీసులు చెప్పారు. వ్యక్తిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. కార్యాలయం ఆవరణలో భార్య కోసం ఆ వ్యక్తి ఎదురు చూశాడని అంటున్నారు.
భార్య విడాకులు నిర్ణయం తీసుకుందని, దాంతో అతను తీవ్ర నిస్పృహకు లోనయ్యాడని అంటున్నారు. వాగ్వివాదం జరుగుతున్న సమయంలో కార్యాలయ సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఫలితం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications