వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ అంటే అభిమానమే కానీ పార్టీ వీడం: కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komati Reddy Rajagopal Reddy
నల్గొండ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు! దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అంటే తమకు ఎంతో అభిమానం అని అయితే, తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీని వీడే ప్రసక్తి మాత్రం లేదన్నారు.

తన సోదరుడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా కాంగ్రెసు పార్టీలోనే ఉంటారని చెప్పారు. తామిద్దరం అవసరమైతే మునుగోడు నుంచి పోటీలో నిలుస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తి లేదన్నారు.

కాగా, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే తాము బయట చూసుకుంటామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పది రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ నెల 11వ తేదిన సిఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు.

అనంతరం కిరణ్‌తో పాటు ఆయన వాహనంలోనే వెనుక సీట్లో కూర్చొని సచివాలయానికి వచ్చారు. కిరణ్‌తో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం సొరంగ మార్గం పనులు, జిల్లాకు రావాల్సిన నిధులపై తాను ముఖ్యమంత్రితో చర్చించానని కోమటిరెడ్డి చెప్పారు. తమ మధ్య ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ డిసిసిబి అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతుందన్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు ఉంటే వాటిని బయట చూసుకుంటామని ఆయన చెప్పారు.

English summary

 Komatireddy says they will not leave Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X