భార్య ముందే సెల్‌ఫోన్‌లో నగ్నంగా బాలిక చిత్రీకరణ

Couple arrested in Srikakulam district
శ్రీకాకుళం: ఇంట్లో పని చేస్తున్న బాలిక పైన అత్యాచారానికి పాల్పడి ఆమెను నగ్నంగా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తిని, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో భార్గవ రెడ్డి ఇంట్లో పదిహేనేళ్ల బాలిక రెండేళ్లుగా పని చేస్తోంది.

ఇటీవల ఇంటి యజమాని తనపై అత్యాచారం చేశాడని.. ఆయన భార్య సమక్షంలోనే సెల్ ఫోన్‌తో తనను నగ్నంగా చిత్రీకరించాడని శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. అదే సమయంలో యజమాని నిర్వహిస్తున్న సెల్ ఫోన్ దుకాణంలో నీలి చిత్రాల వీడియోలు ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో గతంలో అతడు రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు చెప్పారు.

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

అంపోలు సిస్టమ్ ఇంజనీరింగ్ కళాశాలలో సోంపేట మండలం జగతి కేశపురానికి చెందిన ప్రశాంత కుమార్ (19) ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ప్రశాంత్ తల్లి శకుంతల ఫోన్ చేసింది. వెనుక నుంచి కేకలు వినిపించడంతో ఏమిటా గోలని తల్లి ప్రశ్నించింది. తాను అమ్మాయిలతో మాట్లాడుతున్నానని స్నేహితులు హేళన చేస్తున్నారని చెప్పడంతో అమ్మాయిలు కాదు.. అమ్మతో అని చెప్పరా అని బదులిచ్చింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఆదివారం మధ్యాహ్నం వరకూ స్నేహితులతో వున్న ప్రశాంత్ హాస్టల్‌కు వెళ్లి బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు, అధ్యాపకులు అతనిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలియగానే కళాశాల, హాస్టల్ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై గార పోలీసులు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సిఐ ఉమామహేశ్వర రావు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని ఆధారాలు సేకరిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+