మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించలేదనే ప్రేయసి గొంతుకోశాడు: సూసైడ్ యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Man attempts kill young girl
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కెఎల్ రావు కాలనీలో సోమవారం ఉదయం శ్రీని అనే ప్రేమోన్మాది ప్రియురాలి గొంతుకోసిన విషయం తెలిసిందే. బాధితురాలు సుదీరమ్మ తనను ప్రేమించలేదనే కారణంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. కెఎల్ రావు కాలనీలో దర్జీ పని చేస్తున్న వెంకటేశ్వర రావు కుమార్తె సుదీరమ్మ(21) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శ్రీను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

శ్రీనుకు అప్పటికే పెళ్లయింది. కత్తిపీటతో తలపై మోది, ప్రాణాంతకమైన పదార్థాన్ని తాగించే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోశాడు. స్థానికులు గమనించడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికులు, పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తెనాలి జెఎంజె కళాశాలలో సుదీరమ్మ బిఎస్సీ పూర్తి చేసి ఏడాదిగా ఇంటి వద్దే ఉంటోంది. పారిపోయిన నిందితుడు ఆ తర్వాత విజయవాడ సమీపంలోని బూడిద ఫ్యాక్టరీల వద్ద ఉన్న కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

తర్వాత తనంతట తానే కాల్వ నుండి ఒడ్డుకు చేరుకున్నాడు. శ్రీను తన పెళ్లికి ముందు బాధిత యువతితో ప్రేమలో పడ్డట్లుగా తెలుస్తోంది. అనంతర పరిణామాల నేపథ్యంలో అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దాడికి ముందు శ్రీను బాధిత యువతిని వేధించినట్లుగా తెలుస్తోంది.

ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన శ్రీను ఆమెపై దాడికి పాల్పడి గొంతు కోసినట్లుగా తెలుస్తోంది. బాధిత యువతిని అత్యుత్త చికిత్స కోసం కార్పోరేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A man tried to murder a young girl by pouring pesticide forcibly into her mouth and slit her throat with a knife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X