ఓనర్‌ని తుపాకీతో కాల్చిన కుక్క! భారీదోపిడీదారు మృతి

 Dog shoots owner: Fires bullet in Vehicle
న్యూయార్క్/లండన్: యజమానిపై ఓ పెంపుడు కుక్క కాల్పులు జరిపిన సంఘటన అమెరికాలోచోటు చేసుకుంది. ఆ కుక్క కావాలని యజమానిపై కాల్పులు జరపలేదు. అమెరికాలోని ఫ్లొరిడాకు చెందిన జార్జి డేలి లానియర్ పెంపుడు కుక్క కాల్పులకు కారణమైంది.

లానియర్ వాహనంలో బయటికి వెళ్లి ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఏం జరిగిందోనని అటూ ఇటూ చూడగా.. చివరికి తన ఎడమ కాలు కింది భాగంలో పొగలు కనిపించాయి. తన కాలు నుంచి రక్తం కారుతోంది. ఆయన వాహనంలో ఉండగానే ఈ ఘటన జరిగింది.

తన పెంపుడు కుక్క బెరెట్టా 9 ఎంఎం ఆటోమేటిక్ తుపాకీ ట్రిగ్గర్‌ను కదిలించడంతో కారు డోరును చీల్చుకుంటూ బుల్లెట్ దూసుకొచ్చి లానియర్ ఎడమ కాలికి గాయమైంది. తన ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన ఆటోమేటిక్ తుపాకీని నేలపై పడేసి వెళ్లడంతో కుక్క కాల్పులతో కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన కథనం న్యూయార్క్ డెయిలీ న్యూస్‌లో వచ్చింది.

బ్రిటన్ చరిత్రలో భారీ రైలు దోపిడీ ఘటన కీలక సూత్రధారి బ్రూస్ రేనాల్డ్స్‌ మృతి చెందాడు. అనారోగ్యంతో తన తండ్రి గురువారం మృతి చెందినట్లు అతని కుమారుడు చెప్పాడు. 1963లో గ్లాస్‌గో నుంచి లండన్ వెళ్తున్న ట్రెయిన్‌లో భారీ చోరీకి రెనాల్డ్స్ తన దోపిడీ బృందంతో కలిసి వ్యూహరచన చేశాడు.

2.6 మిలియన్ పౌండ్లు దోపిడీకి గురయ్యాయి. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం. ఆ తర్వాత ఐదేళ్లు పరారీలో ఉన్న అతను 1968లో అరెస్టయ్యాడు. 25 ఏళ్ల జైలు జీవితం అనంతరం విడుదలయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+