అనిల్ పారిపోయే ఛాన్స్, షర్మిల అదెవరి కారు?: బిజెపి

Anil Kumar
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ పైన భారతీయ జనతా పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ ఆదివారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనిల్ కుమార్ అక్రమాలకు మారుపేరుగా నిలిచారని ఆరోపించారు. మణికొండ భూకేటాయింపులపై బ్రదర్ అనిల్‌దే కీలక పాత్ర అన్నారు.

రక్షణ, ఆమోదా స్టీల్స్ కంపెనీల్ బ్రదర్ అనిల్ బినామీ కంపెనీలే అన్నారు. రక్షణ అనిల్ బినామీ కొండలరావు పేరు పైన ఉందన్నారు. ఆ వ్యవహారాల్ని ఆయనే చూస్తున్నారన్నారు. రక్షణ అనిల్ బినామీ కంపెనీయే అని చెప్పేందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. వీటిపై తాము ఎలాంటి సవాల్‌కైనా సిద్ధమే అన్నారు. బెనిడేటా సంస్థకు చెందిన ఆడి కారును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఉపయోగిస్తున్నారన్నారు.

ఆ సంస్థ జిఎం వీరభద్రా రెడ్డి మృతికి బినామీ బిస్తులే కారణమన్నారు. వీరభద్రా రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. షర్మిల కారు కూతలు మానుకోవాలని, అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. షర్మిల వాడుతున్నది ఎవరి ఆడి కారో చెప్పాలని ప్రశ్నించారు. అనిల్ కుమార్ ఏ రోజైనా ఈ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని, పాసుపోర్టును స్వాధీనం చేసుకోవాలన్నారు. అనిల్ ఆస్తులపై విచారణ జరిపించాలన్నారు. షర్మిల తన ఆస్తులపై విచారణకు ఒప్పుకోవాలన్నారు.

మజ్లిస్ పార్టీ నేతలు హిందువులు, హిందు దేవతల పైన వ్యాఖ్యలు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పందించలేదన్నారు. తాము హిందువులకు వ్యతిరేకం కాదని హిందుత్వానికి వ్యతిరేకం కాదంటున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఖండించలేదన్నారు. బాంబు పేలుళ్ల బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. మజ్లిస్ నేతల వ్యాఖ్యల వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. బాబ్లీ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వల్ల తెలంగాణకు నష్టం, శాపం అన్నారు. బాబ్లీపై ప్రభుత్వ ప్రకటన ప్రజలను వంచించడమే అన్నారు. పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+