జర్మన్ యువతిపై రేప్: ప్రేయసి లేఖతో దొరికిన బిట్టీ

రాఘవ్ రాజన్ బిట్టి మొహంతియేనని తేలింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బిట్టీ మొహంతి రాఘవ్ రాజన్ గుర్తింపుతో వ్యవహరిస్తున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్‌లో రాఘవ్ రాజన్ పేరుతో పనిచేస్తున్న బిట్టి మొహంతిని పోలీసులు అరెస్టు చేశారు.
బిట్టి మొహంతి ఎవరనే విషయం తెలియజేస్తూ చేతిరాతతో ఉన్న ఆకాశరామన్న ఉత్తరం అతను పనిచేస్తున్న బ్యాంకుకు వచ్చింది. ఆ లేఖను అతని మహిళా సహోద్యోగి రాసినట్లు సమాచారం. ఆమె బిట్టి ప్రేయసి అని కూడా చెబుతున్నారు.
బ్యాంక్ ఫిర్యాదుతో బిట్టి మొహంతిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వ్యక్తిగత వివరాలు, అతను చెబుతున్న విషయాలకు మధ్య పొంతన లేదని బ్యాంకు ఉన్నతాధికారులు చెప్పారు. బిట్టి బ్యాంకులో ఏడు నెలలుగా పనిచేస్తున్నాడని, కన్నూరు విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చేసినట్లు చెబుకున్నాడని పోలీసులు అంటున్నారు. కేరళలోని కన్నూరులోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
26 ఏళ్ల జర్మన్ యాత్రికురాలిపై అత్యాచారం చేసిన కేసులో బిట్టి మొహంతికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత పెరోల్‌పై విడుదలై పరారయ్యాడు. తన హోదాను వాడి బిట్టీ తండ్రి అతని పరారీకి సహాయపడ్డాడు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications