అసెంబ్లీకి ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: బాలయ్య

రానున్న ఎన్నికల్లో శానససభ్యుడిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాను రాష్ట్రంలో ఏ సీటు నుంచైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పార్టీ ఆదేశిస్తే సామాన్య కార్యకర్తగా సైతం పార్టీ అభివృద్ధికి పాటు పడుతానని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఆయన అభిమానులతో కలివిడిగా తిరుగుతూ ఫొటోలు కూడా దిగారు.
తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ శుక్రవారం చెప్పారు. ఆయన విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూనియర్‌తో ఎలాంటి విభేదాల్లేవన్నారు.
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వస్తున్నా మీకోసం పాదయాత్రలో తాను పాల్గొంటానని బాలయ్య ఈ సందర్భంగా చెప్పారు. బాబుతో కలిసి పాదయాత్ర చేస్తానని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి బాలయ్య పాల్గొంటారని చెబుతున్నారు. రెండుమూడుసార్లు బాలకృష్ణ బాబును కలిశారు. ఇటీవల కృష్ణా జిల్లా విజయవాడలోని గుడివాడ నియోజకవర్గంలో బాబు పాదయాత్రలో పాల్గొన్న బాలయ్య అంతా తానై చూశారు.












Click it and Unblock the Notifications