బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ కన్నుమూత

Margaret Thatcher
లండన్: బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ కన్నుమూశారు. స్ట్రోక్ కారణంగా ఆమె లండన్‌లో మరణించినట్లు ఆమె అధికార ప్రతినిధి లార్డ్ బెల్ ఆదివారంనాడు చెప్పారు. ఆమె వయస్సు 87 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ఆమె శ్వాససంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. బ్రిటన్ తొలి మహిళా ప్రధానిగా ఆమె ఖ్యాతి గడించారు.

తమ తల్లి థారచర్ ప్రశాంతంగా కన్నుమూశారని, స్ట్రోక్ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారని ఆమె పిల్లలు మార్క్, కరోల్ థాచర్ విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారని లార్డ్ బెల్ చెప్పారు. యుద్ధానంతరం ప్రపంచ రాజకీయాల్లో అగ్రశ్రేణి నేతల్లో ఒకరిగా ఆమె ప్రసిద్ధి గడించారు.

థాచర్ 1979 నుంచి 1990 వరకు కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఉన్నారు. వ్యక్తిగత, రాజకీయ కఠినత్వం వల్ల ఆమె ఉక్కు మహిళగా పేరు గడించారు. థాచర్ 2002లో స్ట్రోక్ కారణంగా ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పలుసార్లు ఆమెకు స్ట్రోక్ వచ్చింది.

చివరి రోజుల్లో చాలా తక్కువగా బయటకు వచ్చారు. ప్రధాని డేవిడ్ కామెరోన్ థాచర్ 85వ జన్మదినం సందర్భంగా 2010 అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా ఆమె వెళ్లలేదు. లండన్‌లో 2011 జులైలో జరిగిన తమ పాత మిత్రుడు రోనాల్డ్ రీగన్ విగ్రహావిష్కరణకు కూడా ఆమె హాజరు కాలేదు. 2012 డిసెంబర్‌లో ఆమె ఆస్పత్రిలో చేరారు.

తన జీవిత కాలంలో బ్రిటన్‌కు మహిళా ప్రధానిని చూస్తాననే నమ్మకం లేదని ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆరు నెలలకో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+