రియల్ ఎస్టేట్ టైకూన్ భరద్వాజ్ హత్య: కొడుకు అరెస్ట్

తన తండ్రి దీపక్ భరద్వాజ్‌ను చంపేందుకు నితేష్ భరద్వాజ్ కాంట్రాక్టు కిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఇందుకోసం నితేష్ రూ.6 కోట్లను హవాలా ద్వారా కాంట్రాక్టు కిల్లర్స్‌కు చెల్లించారని చెబుతున్నారు. ఈ హత్య మార్చి 26వ తేదిన జరిగింది.
మరోవైపు ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపక్ హత్య కేసులో ఓ స్వామికి కూడా సంబంధం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడి బంధువైన నితేష్ ప్రాపర్టీ విషయమై భరద్వాజ్‌ను చంపించి ఉంటారని విచారణాధికారులు అనుమానిస్తున్నారు.
2009 ఎన్నికల్లో దీపక్ భరద్వాజ్ లోకసభ ఎన్నికలకు బిఎస్పీ తరఫున పోటీ చేశాడు. అప్పుడు అతను తన ఆస్తులను రూ.600 కోట్లుగా చెప్పారు. ఇప్పుడు దీపక్ ఆస్తులు మరింత పెరిగి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి సొంతగా ఆశ్రమం పెట్టాలని భావించాడట. ప్రస్తుతం సదరు స్వామి పరారీలో ఉన్నాడు.
దీపక్ భరద్వాజ్ హత్యకు ఆరు నెలల ముందే ప్లాన్ వేశారని పోలీసులు భావిస్తున్నారు. దీపక్‌ను చంపేందుకు జనవరి, మార్చి నెలల్లో రెండుసార్లు ప్రయత్నాలు చేశారని అనుమానిస్తున్నారు. నితేష్ కుమార్ బాలీవుడ్ నటుడి బంధువును పెళ్లి చేసుకున్నాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications