ఫోటో: బోస్టన్ బంబార్లు బ్రదర్స్, రష్యన్ కాకస్‌వాళ్లు
బోస్టన్: అమెరికాలోని బోస్టన్‌లో పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. రెండో అనుమానితుడిని 19 ఏళ్ల ద్జోఖర్ త్సార్నేవ్‌గా గుర్తించారు. అతని కోసం బోస్టన్ శివారులోని వాటర్‌టౌన్‌లో గాలిస్తున్నారు. మరో అనుమానితుడు మరణించాడు. అతన్ని తామెర్లాన్ త్సార్నేవ్‌గా గుర్తించారు. వారిద్దనిరి సోదురులుగా భావిస్తున్నారు.
సోదురులైన వారిద్దరు రష్యన్ కాకసస్‌కు చెందినవారు. చాలా చిన్న వయస్సులోనే వారిద్దరు కజకిస్థాన్ చేరుకున్నారు. ఆ తర్వాత అమెరికాకు వచ్చారు. చాలా ఏళ్ల క్రితమే వారు అమెరికా వచ్చారు. నోటీసు ఇచ్చే వరకు అన్ని రకాల ప్రభుత్వ రవాణాను, టాక్సీ సర్వీసులను నిషేధించారు. విమానయాన అధికార యంత్రాంగం విమానా సర్వీసులను నిలిపేసింది. అనుమానంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని బోస్టన్ పోలీసు కమిషనర్ ఎడ్వర్డ్ డేవిస్ ప్రజలను కోరారు.
తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండాలిని మాసాచుసెట్స్ గవర్నర్ డేవల్ పాట్రిక్ ప్రజలకు సూచించారు. బోస్టను పోలీసులు వస్తే తప్ప తలుపులు తీయవద్దని ఆయన సూచించారు. ఎఫ్‌బిఐ ఇద్దరు అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది.
డ్రామా ఎలా ప్రారంభమైంది..

అమెరికా కాలమాన ప్రకారం గురువారం పొద్దుపోయిన తర్వాత 7/11 కన్వినీయెన్స్ దోపిడీతో డ్రామా ప్రారంభమైంది. దీని తర్వాత ఎఫ్‌బిఐ అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. కారులో కూర్చున్న మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జీ పోలీసు ఆఫీసర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు బాంబర్లే బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు.
పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సోదరులు తుపాకి గురి పెట్టి కేంబ్రిడ్జీ నుంచి మెర్సిడీస్ కారును హైజాక్ చేశారు. అర గంట తర్వాత డ్రైవర్‌ను విడుదల చేశారు. పోలీసులు వారిని వెంటాడారు. దాంతో వాళ్లు పేలుడు పదార్థాలు విసిరారు, పోలీసు అధికారులపై కాల్పులు జరిపారు. అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో తామెర్లాన్ గాయపడ్డాడు. అతను బెత్ ఇజ్రాయెల్ ఆస్పత్రిలో మరణించాడు. అతనికి బుల్లెట్ గాయాలున్నాయి. ద్జోఖర్ పారిపోయినట్లు భావిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications