హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పడిగాపులు: వృద్ధురాలి ఉసురు తీసిన పింఛను

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxamamma
హైదరాబాద్: పింఛను కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడిన వృద్ధురాలు మృత్యువాత పడింది. నెల నెలా వచ్చే 200 రూపాయల పింఛను ఆమె ఉసురు తీసింది. స్మార్ట్ కార్డులు తీసుకోకపోతే పింఛను రద్దుచేస్తామనే హెచ్చరికలతో ఫొటో దిగడంతోపాటు పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి ఊపిరి ఆగిపోయింది.

హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట మండల పరిధిలోని వృద్ధాప్యం, విక లాంగ, వితంతువు పింఛన్‌దారుల్లో స్మార్ట్‌కార్డులు లేని వారి కోసం ఈనెల 9, 10, 11వ తేదీల్లో గోల్నాకలోని వడ్డెర బస్తీలో కేంద్రం పెట్టారు. ఉదయం 8 గంటలకే ఈ కేంద్రానికి చేరుకున్న లక్ష్మమ్మ(60) మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా కార్డులు జారీ చేసేవారు రాలేదు.

గొంతు తడుపుకోవడానికి నీళ్లులేక, నిల్చోవడానికి నిలువ నీడలేక ఎండకు లక్ష్మమ్మ అల్లాడింది. వడదెబ్బకు గురై కేంద్రంలోనే కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి ఆమెను తరలించినా ఫలితం లేదు. వృద్ధురాలు ప్రాణం విడిచింది.

అంబర్‌పేట మండల పరిధిలో మూడు కేంద్రాలను ఫొటోలు దిగేందుకు ఏర్పాటు చేసినప్పటికీ సకాలంలో సిబ్బంది రాకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. ఈ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడంపై కలెక్టర్ రిజ్వీ ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా మొదటి వారంలో పింఛను డబ్బులను పంపిణీ చేస్తారు. ఈనెల 5వ తేదీ నుం చి 8వ తేదీ దాకా స్మార్ట్‌కార్డులు ఉన్నవారికి పింఛన్ల పంపిణీ జరిగింది. వడ్డెరబస్తీ కేంద్రంలో తహసీల్దార్ల పర్యవేక్షణలో ఈ కేంద్రాల్లో వివరాల సేకరణ జరగాల్సి ఉండగా మధ్యా హ్నం దాకా అధికారులెవరూ ఈ కేంద్రాలకు వెళ్లలేదు.

రద్దీతోపాటు మండుతున్న ఎండలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. కొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు కూడా.

English summary
An old lady made to wait from morning till evening waiting for smart card to get old age pension died at Amberpet in Hydearabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X