Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ వార్ ముగించేస్తాం..! అమెరికా మంత్రి సంచలన ప్రకటన..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) కలిసి చేస్తున్నదాడులు (iran war) మూడో వారానికి చేరుకున్నాయి. ఇరాన్ లో నాయకత్వ మార్పు టార్గెట్ గా చేపట్టిన ఈ దాడులు ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ముఖ్యంగా ఈ దాడులు చమురు క్షేత్రాలకు విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడటం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఇవాళ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు.

ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..!
ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..!

పెంటగాన్‌లో ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్.(pete hegseth). ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. గత వారం ఇరాక్‌లో మరణించిన ఆరుగురు అమెరికా సైనికుల కుటుంబాలతో తాను మాట్లాడానని, వారు పని పూర్తయ్యే వరకు ఆగవద్దని తనను, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారని ఆయన తెలిపారు. అయితే ఇరాన్‌తో సంఘర్షణ శాశ్వత యుద్ధం కాదని ఆయన తేల్చేశారు. ఇది ఇరాక్ యుద్దం తరహాలో సుదీర్ఘంగా సాగబోదని తేల్చిచెప్పేశారు.

US Defense secretary Pete Hegseth Vows to End Iran War Not Like Iraq
చమురు క్షేత్రాలకు పాకిన ఇరాన్ వార్..! ఆకాశానికి పెట్రో ధరలు..!
చమురు క్షేత్రాలకు పాకిన ఇరాన్ వార్..! ఆకాశానికి పెట్రో ధరలు..!

తమ ఇంధన మౌలిక సదుపాయాలపై మళ్లీ దాడి జరిగితే, గల్ఫ్ చమురు, గ్యాస్ సౌకర్యాలు పూర్తిగా నాశనమవుతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇవాళ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా సౌదీ అరామ్ కో, యూఏఈ టెర్మినల్స్, ఖతార్‌లో మిగిలి ఉన్న ఎల్‌ఎన్‌జి ట్రైన్‌లతో సహా ప్రతి గల్ఫ్ ఇంధన ఆస్తినీ ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ తమ దేశంలోని సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై జరిపిన దాడికి ప్రతిగా ఇవాళ గల్ఫ్ దేశాల్లో తీవ్రదాడులకు దిగుతున్న ఇరాన్ ను ఎలా నియంత్రించాలో తెలియని పరిస్ధితుల్లో ఉన్న అమెరికా .. యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని చేసిన ప్రకటన చర్చనీయాశంవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+