ఎడమ చేత్తో ఇచ్చేవాడ్ని: డిఎల్, పెళ్లికి ముందే: జగ్గారెడ్డి

కాంగ్రెసులో 35 ఏళ్లు పనిచేశానని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఉండాలా, వద్దా అనే విషయంపై శానససభా సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయలేనని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రెండు నెలల క్రితమే చెప్పినట్లు ఆయన తెలిపారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని అన్నారు. అధికారంలో ఉన్నంత వరకు సంపాదించుకుని కాంగ్రెసు పార్టీని నాశనం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని కాంగ్రెసు శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి అన్నారు. పథకాల అమలులో తప్పు జరిగితే కదా డిఎల్ ఎత్తి చూపేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ అంశం ఇప్పుడు అప్రస్తుతమని ఆయన అన్నారు.
పెళ్లికి ముందు శుభలేఖలు ఇస్తారా, తర్వాత ఇస్తారా అని ఆయన అడిగారు. ప్రభుత్వ పథకాల ప్రచారం కూడా అంతేనని ఆయన అన్నారు. పథకాలు ప్రారంభం కాకముందే వాణిజ్య ప్రకటనలు ఇవ్వడంపై డిఎల్ వేసిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా అన్నారు. ముఖ్యమంత్రికి కోపం ఉంటే డిల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవి వచ్చేదా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications