హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో భార్య నగ్న ఫోటోలు ఫ్రెండ్స్‌కి మెయిల్ చేసిన టెక్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arrest
హైదరాబాద్/బెంగళూరు: భార్య న్యూడ్ చిత్రాలు మెయిల్స్ ద్వారా స్నేహితులకు, బంధువులకు పంపుతున్న ఓ టెక్కీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బళ్లారికి చెందిన 38 ఏళ్ల నంద కుమార్ జై లండన్‌లో ఓ యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. తన మొదటి వివాహాన్ని దాచిపెట్టి అతను ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఓ సంతానం ఉంది. అతను ప్రస్తుతం బెంగళూరులో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

కొద్ది కాలం తర్వాత విభేదాల కారణంగా ఆమె విడాకులు కోరింది. అప్పటి నుండి అతను ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె పేర ఫేక్ ఈ మెయిల్ ఐడిని సృష్టించి, ఆమె న్యూడ్ ఫోటోలను స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులకు పంపించడం ప్రారంభించాడు. వారిద్దరి కలిసి సహజీవనం చేసిన సమయంలోని ఫోటోలను కూడా వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు.

దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతుంది నంద కుమార్ జైగా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కూడా అతనికి గతంలోనే మరో వివాహం అయిందని తేలింది. బాధితురాలు గుంటూరు జిల్లాకు చెందిన మహిళ.

ఆమె ప్రస్తుతం చికాగోలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆమె గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కొంతకాలం క్రితం వరకు అతనికి డబ్బులు పంపించారు. డబ్బు పంపించడం ఆగినప్పటి తర్వాత అతను ఫేక్ ఈ మెయిల్ ఐడి సృష్టించి ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు.

English summary
A software engineer from Bangalore was arrested by Andhra Pradesh police on the charge of sending emails containing obscene photos of his wife who had sought divorce for allegedly hiding his first marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X