శంకరన్నకు కొత్త కష్టం: వేధింపులని కోడలు ఫిర్యాదు

తన భర్త శశాంక్, మామ శంకర రావు, అత్త విశ్వశాంతి, ఆడపడుచు సుష్మితను అరెస్టు చేయాలని ఆమె అందులో కోరారు. వారు తమను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులచే విచారణ జరిపించాలని కోరారు. తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె అన్నారు.
అంతకుముందు క్రిమినల్ కోర్టు వారిని కోర్టు ఎదుట లొంగిపోవాలని, పాస్‌పోర్టులు పోలీసులకు ఇవ్వాలని ఆదేశించిందని కానీ, వారు సరెండర్ కాలేదని, వారిపై పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
వంశీప్రియ చేసిన ఫిర్యాదు మేరకు... శంకర రావు కూతురు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతనే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు. తనను వేధిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications