జయప్రద, మురళీ‌మోహన్‌లపై అలీ (పిక్చర్స్)

రాజమండ్రి: కాంగ్రెసు పార్టీ తరఫున ఉండవల్లి అరుణ్ కుమార్ లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి సీటును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినీ తారల పోరుగా రాజమండ్రి పోరు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి లోకసభ స్థానానికి తమ పార్టీ తరఫున ప్రముఖ హాస్య నటుడు అలీని పోటీకి దించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

రాజమండ్రి నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా సినీ నటి జయప్రద పోటీకి దిగే అవకాశాలున్నాయి. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరేందుకు పూర్తిగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమెకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. రాజమండ్రి టికెట్ ఖాయం చేసినట్లు కూడా చెబుతున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ నుంచి మురళీ మోహన్ రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేయడం ఖరారైంది. దీంతో మురళీమోహన్, జయప్రదలకు పోటీగా అలీ రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

జయప్రద, మురళీ‌మోహన్‌లపై అలీ (పిక్చర్స్)

రాజమండ్రి లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా సినీ నటి జయప్రద పోటీ చేయడం ఖాయమైనట్లు చెబుతున్నారు. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరడానికి సోనియా గాంధీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది.

జయప్రద, మురళీ‌మోహన్‌లపై అలీ (పిక్చర్స్)

కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో జయప్రద కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇటీవల జయప్రద సినిమాకు ఒకదానికి చిరంజీవి క్లాప్ కూడా కొట్టారు.

జయప్రద, మురళీ‌మోహన్‌లపై అలీ (పిక్చర్స్)

జయప్రద రాజమండ్రి నుంచి పోటీ చేస్తే తాను సహకరిస్తానని ప్రస్తుత లోకసభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌కు రాజ్యసభకు పంపే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

జయప్రద, మురళీ‌మోహన్‌లపై అలీ (పిక్చర్స్)

తెలుగుదేశం పార్టీ తరఫున సినీ నటుడు మురళీ మోహన్ రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఆయన జయప్రదపై పోటీ పడనున్నారు.

జయప్రద, మురళీ‌మోహన్‌లపై అలీ (పిక్చర్స్)

ప్రముఖ హాస్య నటుడు అలీని మురళీ మోహన్, జయప్రదలపై పోటీకి దించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అలీ ప్రకటించారు.

నిజానికి, అలీ తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నారని అంటున్నారు. రాజమండ్రి సీటుకు అప్పటికే మురళీ మోహన్‌కు ఖాయం కావడంతో అలీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో అలీ కోసం వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, జయప్రద వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, రాజమండ్రి సీటుకు ఆమె పట్టు బట్టారు. కానీ, జగన్ ఆమెకు సీటు గ్యారంటీ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె కాంగ్రెసు పార్టీ వైపు చూశారని చెబుతున్నారు.

అయితే, తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ఎన్నికల్లో పోటీ చేయబోనని అలీ ప్రకటించారు. అయినా, అలీ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహం కూడా అలీకి బాగా కలిసి వస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+