గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై మందకృష్ణ పోరు: కాంగ్రెసుపైనా విమర్శలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
గుంటూరు: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. పనిలో పనిగా కాంగ్రెసు పార్టీని కూడా ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మాదిగలు భజనలు చేయవద్దని ఆయన సూచించారు. ఆదివారం గుంటూరు జిల్లా సత్తెపల్లిలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు.

వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ మాదిగల వ్యతిరేకి అని, వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీలో మాదిగలకు గుర్తింపు లేదని ఆయన అన్నారు. ఆ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు డేవిడ్‌రాజు, మారెప్ప, సూర్యప్రకాశరావుకు పార్టీపరంగా గుర్తింపు లభించటం లేదని అన్నారు. జూపూడి ప్రభాకరరావును మాత్రం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వర్గీకరణకు వ్యతిరేకమన్నారు.

ఎమ్మార్పీయస్ మాలలకు వ్యతిరేకం కాదని, రిజర్వేషన్ ఫలాలను అన్నదమ్ముల్లా పంచుకుందామని కృష్ణమాదిగ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1999 వరకు మాదిగలకు 20వేల ఉద్యోగాలు వస్తే 99 నుంచి 2004 వరకు 24వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ తప్ప అన్నిపార్టీలు ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణకు ముందుకొస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మీ, జెడి శీలం, ఎంపి హర్షకుమార్‌లు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

సుప్రీంకోర్టులో మాల జడ్జీలు ఉండటం వల్లనే వర్గీకరణను రద్దు చేశారన్నారు. సమాజంలో వివిధ వర్గాల కోసం ఎంఆర్‌పిఎస్ పోరాడుతుందన్నారు. జగ్జ్జీవన్‌రామ్‌కు భారతరత్న ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు. 50 సంవత్సరాలు దేశానికి సేవలందించిన బాబు జగ్జ్జీవన్‌రామ్‌కు భారతరత్న ఇవ్వకపోవటం బాధాకరమని కృష్ణమాదిగ అన్నారు.

జగ్జీవన్‌రామ్‌కు భారతరత్న ఇవ్వాలని తాను, మంత్రి మాణిక్యవరప్రసాద్, కాంగ్రెస్ ఎంపి నంది ఎల్లయ్యలు సోనియాగాంధీని కలిస్తే ఎమర్జెన్సీ టైమ్‌లో మా అత్త ఇందిరాగాంధీకి బాబు జగజ్జీవన్‌రామ్ అండగా నిలవలేదని, భారతరత్న ఎలా వస్తుందని ప్రశ్నించారని కృష్ణమాదిగ తెలిపారు.

English summary
MRPS leader Manda Krishna Madiga has begun his fight against YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X