ఒబామా ఇంట్లో పుట్టా: తన స్థానికతపై కెకె వ్యంగ్యం

తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారని వస్తున్న వార్తలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ప్యాకేజీ అంటే ఏమిటి ? అని ఎదురు ప్రశ్న వేశారు. ప్యాకేజీలు తమకు తెలియవని, ప్రజలు కోరుకున్న పార్టీగా ఆ అంశం తమ దృష్టిలో లేదని అన్నారు. తాను కొందరు కాంగ్రెస్ నేతలను బలి పశువులను చేశానంటూ వస్తున్న ఆరోపణలను కేకే తోసిపుచ్చారు. ఎవరు బలి పశువులు అవుతారో ఏడు నెలల తర్వాత చూస్తారన్నారు.
తమ పార్టీని ఉద్యమ పార్టీగానే కాకుండా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని తెరాస నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు కడియం తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల్లో కమిటీలు వేస్తామని అన్నారు. దీనిపై చర్చించేందుకు జులై 3వ తేదీన మరోసారి భేటీ అవుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications