ఫ్లడ్స్ రిలీఫ్: కుప్పకూలిన హెలికాప్టర్, 20 మంది మృతి

భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ - 17 వి5 హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం ఉంది. అయితే, తెరిపి ఇచ్చినప్పుడల్లా యాత్రికులను రక్షించేందుకు ప్రయత్నాలు సాగించారు. ఇందులో భాగంగానే ఆ హెలికాప్టర్ పనిచేస్తోంది.
ఒక్కసారిగా మేఘాలు కమ్ముకు రావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు, పొగ మంచు అలుముకున్నాయి. వర్షం కూడా పడింది.
కూలిన హెలికాప్టర్ కేదార్‌నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కూలినట్లు తెలుస్తోంది. వచ్చే 72 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధన కార్యాలయం చెప్పింది. ఇంకా 6000 వేల మంది కీలకమైన ప్రదేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో సాధ్యమైనంత త్వరగా బాధితులను బయటకు తేవాలనే ఉద్దేశంతో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications