జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్ సమీపంలో గల బిర్సా మండప్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అహ్మద్ హేమంత్ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు మంత్రులుగా కాంగ్రెసు నేత రాజేంద్రప్రసాద్, ఆర్‌జెడి నేత అన్నపూర్ణా దేవి ప్రమాణం చేశారు.
ఆరు నెలల రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్, జెఎంఎం మధ్య సయోధ్య కుదరడంతో కేంద్రం సూచన మేరకు రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హేమంత్ సొరేన్ ప్రభుత్వం ఏర్పడడానికి మార్గం సుగమమైంది. గత 13 ఏళ్ల కాలంలో జార్ఖండ్‌లో ఇది 9వ ప్రభుత్వం.

జార్ఖండ్ రాష్ట్రం 2000 నవంబర్ 15వ తేదీన ఏర్పడిన తర్వాత బాబూలాల్ మారండీ ఒక్కసారి, అర్జున్ ముండా మూడు విడతలు, శిబూ సొరెన్ మూడు విడతలు, మధు కొడా ఒకసారి ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
కాంగ్రెసు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి), ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యులతో పొత్తు కుదిరిన తర్వాత తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జులై 9వ తేదీన హేమంత్ సొరేన్ గవర్నర్‌కు తెలియజేశారు. తనను బలపరుస్తున్న 43 మంది శాసనసభ్యుల జాబితాను ఆయన గవర్నర్‌కు సమర్పించారు. శానససభలో మొత్తం శానససభ్యుల సంఖ్య 82. సభలో బలపరీక్షలో నెగ్గిన తర్వాత సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.
బిజెపి నాయకత్వంలోని అర్జున్ ముండా ప్రభుత్వానికి జనవరి 8వ తేదీన జెఎంఎం మద్దతు ఉపసంహరించుకుంది. జనవరి 18వ తేదీన కేంద్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఆరు నెలల గడువు ముగుస్తుంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications