అఫైర్ అనుమానం: భార్య ముక్కు చెవులు కొరికాడు

భార్య చెవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముక్కును మాత్రం వైద్యులు తిరిగి ఆమెకు కుట్టేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాకు చెందిందని పోలీసులు చెప్పారు. పాతికేళ్ల ఆ మహిళ తన భర్త మోహన్ లాల్‌తో నంగాలియా గ్రామంలో ఉంటోంది. గురువారం రాత్రి అరుస్తూ ఆ మహిళ ఇంటి బయటకు పరుగెత్తుకుని వచ్చింది.
దాంతో పొరుగువారు వచ్చి చేరారు. చెవులు, ముక్కు కొరికేసి ఉండి విపరీతంగా రక్తం కారుతుండడాన్ని వారు గుర్తించారు. మహిళను పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు.
మోహన్ లాల్ పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతుండడం గమనించిన మోహన్ లాల్ తన భార్యకు అతనితో సంబంధం ఉందనే అనుమానంతో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య గొడవ జరిగిందని, తనకు ఏ విధమైన సంబంధం లేదని భార్య చెప్పిన మాటలను అతను వినలేదని, ఆమె చెవులూ ముక్కు కొరికాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications