చిరంజీవి-పవన్ కల్యాణ్: ఏ పార్టీకి 'పవర్' అందిస్తారు?

 Mega family absence in Attarintiki Daredi audio release
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ 'ఎవడు' సినిమా ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, 'అత్తారింటికి దారేది' వేడుకలో మెగాస్టార్ కుటుంబం కనిపించక పోవడం మరోసారి చర్చకు దారి తీసింది. మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు ముదిరాయా అనే చర్చ సాగుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటి నుండి చిరు సోదరుల మధ్య బేదాభిప్రాయాలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం ఇష్టంలేని పవన్ దూరంగా ఉంటున్నారనే ప్రచారం మొదటి నుండి ఉంది. ఆ తర్వాత పలుమార్లు జరిగిన సినిమా ఫంక్షన్‌లలో అందరూ కనిపించక పోవడంపై ఎప్పటికప్పుడు వారు వివరణ ఇస్తున్నారు. ఎంతగా వివరణ ఇస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆడియో ఫంక్షన్‌లకు గైర్హాజరు అవుతుండటం చర్చకు, అనుమానాలకు తావిస్తోంది.

ఎవడు వేడుకలో పవన్ కనిపించకపోగా.. అత్తారింటికి దారేది ఫంక్షన్లో పవన్ మినహా ఎవరూ కనిపించలేదు. ఎవడు సమయంలో పవన్ షూటింగులో ఉన్నాడనుకుంటే.. పవన్ ఆడియో విడుదల సమయంలో మెగా కుటుంబంలో ఒక్కరికైనా వీలుకాలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

విలీనం తర్వాత కుటుంబానికి దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. అది అంతా ఉత్తిదే అని తేలింది. తాజాగా పొట్లూరి వరప్రసాద్ సినిమాలో పవర్ స్టార్ నటిస్తున్నారని సమాచారం. దీంతో పవన్ కల్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఇది కూడా టిడిపి చేరుతారనే ప్రచారం వంటిదే అంటున్నారు.

తన సోదరుడి పైన పవన్ కల్యాణ్ అసంతృప్తి నిజమైనా 2014 ఎన్నికల్లో అవసరమైతే ఏ పార్టీకి ప్రచారం చేయకుండా దూరంగా ఉంటారే తప్ప చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేయరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చిరు కోసమైనా పవన్ కల్యాణ్ కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేసి పెడతారా.. లేక ఇతర రాజకీయ పార్టీకి పవర్ అందిస్తారా? అనేది ఎన్నికల నాటికి తేలే అంశమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+