బాబు ఇలాకాలో టిడిపి: సొంతూళ్లో మేకపాటికి దెబ్బ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లాలోని ఆయన సొంతూరు బ్రాహ్మణపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు.
చెదురుమొదురు సంఘటనలు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా కొనసాగిందని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కొడవటగట్టుపల్లిలో అభ్యర్థులు ఎక్కువగా, గుర్తులు తక్కువగా ఉన్నట్లు ఫిర్యాదు వచ్చిందని, వీటిపై జిల్లా కలెక్టర్ల నివేదిక తర్వాత పోలింగ్ నిర్వహిస్తామని నవీన్‌మిట్టల్ తెలిపారు.
బ్యాలెట్ బాక్సులో ఇంక్
తిరుపతినగరంలోని వేదాంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో దొంగ ఓట్లు వస్తున్నారంటూ ఓ మహిళ బ్యాలెట్ బ్యాక్స్‌లో ఇంక్ పోసింది. పోలింగ్ కేంద్రం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వెంటనే అధికారులు బ్యాలెట్ బాక్స్‌ను పరిశీలించి, అంతా సరిగా ఉందని తేల్చారు. కాసేపటి తర్వాత తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.
కర్నూలు జిల్లాలోని నందాయల మండలం కత్తెచర్లపల్లి పంచాయతీ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల ప్రచారం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పనిచేయని వెబ్‌కామ్‌లు
నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసి వెబ్‌కామ్‌లు పనిచేయకపోవడంతో బీఎస్ఎన్ఎల్ అధికారులపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జలదంకి మండలం చికకాకలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు వారి చెదరగొట్టారు. అటు బ్రాహ్మణకాకలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓ వికలాంగుడి పట్ల జాయింట్ కలెక్టర్ దురుసుగా ప్రవర్తించారు. ఓటేసేందుకు వచ్చి ఓ వికలాంగుడిని జేసీ బాబురావునాయుడు చొక్కాపట్టుకుని బయటకు నెట్టాశాడు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications