టి బిల్లు: సుష్మకు ప్రధాని ఫోన్, ప్రజలకు బిజెపి కంగ్రాట్స్

ప్రధాని తమ నేత సుష్మకు ఫోన్ చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరారని చెప్పారు. ఈ విషయమై సుష్మా స్వరాజ్ తనతో మాట్లాడారని అన్నారు. తాము హైదరాబాదు రాజధానికి పది జిల్లాలతో కూడిన తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ సాకారమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు సుష్మా స్వరాజ్ శుభాకాంక్షలు చెప్పారన్నారు.
చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం: కారత్
తాము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని సిపిఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు. రెండో ఎస్సార్సీని కూడా అంగీకరించమన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రాజ్యాంగబద్దంగా ప్రత్యేక స్థాయి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలపై తమ వైఖరిలో మార్పు లేదన్నారు. ఎపి సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications