వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీక్రెట్ ఆపరేషన్: యాసిన్‌ను ఎలా అరెస్టు చేశారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Yasin Bhatkal
పాట్నా: హైదరాబాదులోని జంట పేలుళ్లుతో పాటు దేశవ్యాప్తంగా పలు బాంబు పేలుళ్లకు కారకుడైన ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ అరెస్టుకు అత్యంత గోప్యంగా ఆపరేషన్ జరిగింది. అతని అరెస్టును కూడా అత్యంత రహస్యంగా ఉంచారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులకు మాత్రమే విషయం చెప్పారు.

విచారణ నిమిత్తం అతన్ని ఎక్కడు పెట్టారనే విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. యాసిన్ భత్కల్ ఆరెస్టులో బీహార్ పోలీసులు కీలక పాత్ర పోషించారని ఆ రాష్ట్ర పోలీసు చీఫ్ అభియానంద్ గురువారం చెప్పారు.

భత్కల్‌ను అరెస్టు చేయడానికి బీహార్ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), ఇతర ప్రభుత్వ సంస్థలకు ప్రధానంగా సహాయపడినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. భత్కల్‌ను ఇండియా, భారత్ సరిహద్దుల్లో బుధవారం రాత్రి అరెస్టు చేసి, బీహార్ పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. అరెస్టయిన తర్వాత బీహార్ పోలీసులు రహస్య ప్రదేశంలో అతన్ని విచారించారు.

ఢిల్లీకి తీసుకుని వెళ్లడానికి ముందు భత్కల్‌ను రాగ్జాల్ నుంచి మోతిహరికి తీసుకుని వస్తామని చంపారన్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ వినయ్ కుమార్ చెప్పారు. చివరి నిమిషం వరకు ఎవరిని అరెస్టు చేయబోతున్నామనే విషయాన్ని దాచి పెట్టారు. కొద్ది మంది ఎంపిక చేసిన అధికారులకు మాత్రమే విషయం చెప్పారు.

English summary
The operation to arrest Indian Mujahideen chief Yasin Bhatkal was so secret that even after his arrest only few top Bihar Police officers were informed and they too were not told about where he was being held for questioning, an officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X