కిరణ్, బాబు, జగన్‌లపై హరీష్ సెటైర్: పొగరని శంకరన్న

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల దీక్ష వెనుక చంద్రబాబు ఉన్నారన్నారు. ఆయన చేసేది ఆత్మగౌరవ యాత్ర కాదని తెలంగాణను అడ్డుకునే యాత్ర అన్నారు. జగన్‌ది మాట తప్పుడు, మడమ తిప్పుడే తెలుసునని ఎద్దేవా చేశారు. జగన్‌ను నమ్ముకుంటే ఎవరైనా మునిగిపోవాల్సిందే అన్నారు. తెలంగాణకు చెందిన ఆ పార్టీ నేతలు ఇప్పటికే పార్టీని వీడారన్నారు. జగన్‌ను మరో ప్రాంతానికి తరలించాలన్నారు.
చెల్లని రూపాయికి గీతలెక్కువ.. కిరణ్‌కు మాటలెక్కువ అని సెటైర్ వేశారు. తెలంగాణకు అడ్డుపడితే కిరణ్‌ను తెలంగాణ పొలిమేర దాటేదాక తరిమికొడతామన్నారు. కిరణ్‌కు ఒక్క నిమిషం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. అధిష్టానంను ధిక్కరించేలా మాట్లాడుతున్న కిరణ్‌ను కాంగ్రెసు పార్టీ బహిష్కరించాలన్నారు. కిరణ్ నాయకత్వంలో 52 ఉప ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో ఓడిపోయిందన్నారు.
కిరణ్ అహంకారానికి హద్దు లేదు: శంకర రావు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అహంకారానికి హద్దు లేకుండా పోతోందని మాజీ మంత్రి శంకర రావు నిప్పులు చెరిగారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే మీకే సెలవు ఇవ్వాల్సి వస్తుందన్నారు. చీము, నెత్తురు ఉంటే కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. కిరణ్ పార్టీని వీడాలనుకునే ధిక్కరించేలా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications