రాహుల్ నాయకత్వంలో సంతోషంగా పని చేస్తా: ప్రధాని

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న జి-20 సదస్సుకు వెళ్లి తిరిగి వస్తున్న ఆయన ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణం అయినా, మరే ఇతర అంశమైనా ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలు అన్నిటికీ తాను సమాధానం చెప్పాననే భావిస్తున్నానని అన్నారు.
పార్లమెంటుకు చెప్పకుండా ఏ విషయాన్నీ దాచాలన్న ఉద్దేశం తనకు లేదని, తన పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న ఎవరినీ తాను నియంత్రించలేదని చెప్పారు. తెలంగాణ తరహాలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. ఈ నెల చివర్లో న్యూయార్క్‌లో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అవుతానో లేదో చెప్పలేనని, దీనికి సంబంధించి ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని కఠిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
సాధారణ పరిస్థితుల్లో షరీఫ్‌తో భేటీ ఆనందదాయకమేనని, కానీ, క్షేత్రస్థాయిలో కఠిన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తుది నిర్ణ యం తీసుకోవడానికి ముందు ఇటీవలి ఉగ్రవాద దాడులు, ముంబై ముష్కరులను శిక్షించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అంశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని వ్యాఖ్యానించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications