అండర్‌వేర్‌లో బాంబు పేలి.. ముక్కలైపోయాడు.. ఆదిలాబాద్‌లో ఘోరం
అది.. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా. సమీపంలోనే మావోయిస్టుల అడ్డా గడ్చిరోలి. పైగా పక్క జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన. పోలీసులంతా బందోబస్తులో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో పేలుడు చోటుచేసుకోవడం పోలుసులు, ప్రజల్లో కలకలం రేపింది. ఆదిలాబాద్ టౌన్ కు సమీపంలోని ఉట్నూరు క్రాస్ రోడ్డులో పెట్రోల్ బంకు దగ్గర సోమవారం ఈ సంఘటన జరిగింది.

అసలేం జరిగిందటే..
ఏజెన్సీ కావడంతో ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు అడవిపందుల బారి నుంచి పంటను కాపాడుకుంటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో నాటు బాంబులు పేల్చడం ప్రధానమైంది. మహారాష్ట్రకు చెందిన మణిరావు.. జిల్లాలోని రైతులకు నాటు బాంబులు సరఫరా చేస్తుంటాడు. సోమవారం కూడా బాంబులు డెలివరీ ఇచ్చేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చెకింగ్ భయంతో..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఆదిలాబాద్ జిల్లాలో జెలిటిన్ స్టిక్స్ సహా ఇతర పేలుడు పదార్థాల వాడకంపై గట్టినిఘా ఉంది. చెకింగ్ లో పట్టుబడొద్దన్న ఉద్దేశంతో మణిరావు.. బాంబుల్ని తన అండర్‌వేర్‌లో దాచుకున్నాడు. అయితే పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దిగే క్రమంలో బండి స్కిడ్ అయింది. మణిరావుతోపాటు వెనక కూర్చున్న శనిరావు కూడా కిందపడిపోయారు. ఒత్తిడికి గురికావడంతో భారీ శబ్ధంతో బాంబులు పేలాయి. మణిరావు శరీరం ముక్కలై.. 100 నుంచి 200 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి.

షాక్ తిన్న స్థానికులు..
పేలుడు ఘటనతో పెట్రోల్ బంక్ సిబ్బంది, అక్కడి దుకాణం దారులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందో, అర్థంకాక కాసేపు బ్లాంక్ అయిపోయారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడ్డ శనిరావును ఆస్పత్రికి పంపారు. మణిరావు శరీర భాగాల్ని సేకరించి, పోస్ట్ మార్టంకు తరలించారు. సెన్సిటివ్ ఏరియాలో పట్టపగలే బాంబుల సరఫరా జరుగుతున్న విషయం బయటపడటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. రాష్ట్ర సరిహద్దులో సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్యం చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications