సెక్షన్ 149 సీఆర్పీసీ: నారా లోకేష్‌కు నోటీసులు

అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 67వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఇవ్వాళ జిల్లాలోని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సహా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచీ నారా లోకేష్.. స్థానిక వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులపై ఘాటు విమర్శలు చేస్తోన్నారు. కదిరిలో డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి, పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శింగనమలలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డిపై పలు ఆరోపణలు సంధించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిపై భూఆక్రమణ ఆరోపణలు చేశారు. రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు.

 lokesh

పుట్టపర్తిలోనూ అదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఏకంగా దాడులు-ప్రతిదాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ-టీడీపీ నాయకులు పరస్పరం రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. ఈ ఘటనతో పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు పోలీసు బలగాలను అక్కడ మోహరింపజేయాల్సి వచ్చింది. పుట్టపర్తికి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం విడిచిపెట్టారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశించారు. ఈ మేరకు ఆయనకు 149 సీఆర్పీసీ కింద నోటీసులను జారీ చేశారు. తాడిపత్రి సమస్యాత్మక నియోజకవర్గం కావడం వల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేయొద్దని సూచించారు. ఈ నోటీసులను ఇవ్వడానికి తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఈ ఉదయం నారా లోకేష్‌ను కలుసుకున్నారు. నోటీసులు ఇవ్వబోగా- దీన్ని తీసుకోవడానికి నిరాకరించారు. దీన్ని పార్టీ నాయకులు ఇచ్చారు.

 lokesh

తనపై నారా లోకేష్ చేసిన విమర్శలను కేతిరెడ్డి పెద్దారెడ్డి తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ము, ధైర్యం నారా లోకేష్‌కు ఉందా? అంటూ ప్రశ్నించారాయన. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నాననీ అన్నారు. ఈ విషయంలో తాను అవసరమైతే నేరుగా లోకేష్‌నే కలుస్తాననీ స్పష్టం చేశారు. జేసీ బ్రదర్స్ ఇచ్చే స్క్రిప్ట్‌ను చదవడం కాదని, చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+