ఏపీలో క్షీణించిన కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, పశ్చిమగోదావరిలో అత్యధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలో 2వేల లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో ఏపీలో 75,165 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1316 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఏపీలో కొత్తగా 1316 కరోనా కేసులు.. 11 మంది మృతి

ఏపీలో కొత్తగా 1316 కరోనా కేసులు.. 11 మంది మృతి

తాజాగా, నమోదైన 1316 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 6910కి చేరింది. జిల్లాలవారీగా మరణాల సంఖ్య పరిశీలించినట్లయితే.. చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నం ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు.

కర్నూలులో అత్యల్పం.. పశ్చిమగోదావరిలో అత్యధికం..

కర్నూలులో అత్యల్పం.. పశ్చిమగోదావరిలో అత్యధికం..

ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. అనంతపురంలో 60, చిత్తూరులో 198, తూర్పుగోదావరిలో 183, గుంటూరులో 206, కడపలో 58, కృష్ణాలో 196, కర్నూలులో 14, నెల్లూరులో 40, ప్రకాశంలో 43, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 45, విజయనగరంలో 18, పశ్చిమగోదావరిలో 227 కరోనా నమోదయ్యాయి.

16వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

16వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్కరోజు వ్యవధిలో 1821 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,35,801కి చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 16,000 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,08,868 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో నాలుగు లక్షలకు యాక్టివ్ కేసులు

దేశంలో నాలుగు లక్షలకు యాక్టివ్ కేసులు

ఇక దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. వారం పది రోజులుగా 40వేల కంటే తక్కువగానే కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 89,60,205 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 83,83,361 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడి 1,31,639 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,43,189 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+