ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.? భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49,488 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 139 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,86,557కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

గత 24గంటల్లో కరోనాతో ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7142 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 254 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,77,893కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1552 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,27,39,648 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

139 new corona cases reported in andhra pradesh: No deaths in last 24 hours

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 8, చిత్తూరులో 20, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 17, కడపలో 4, కృష్ణాలో 35, కర్నూలులో 6, నెల్లూరులో 5, ప్రకాశంలో 9, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 7, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 15,223 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,10,883కు చేరింది. మరో 151 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,869కు పెరిగింది.

గడిచిన 24 గంటల్లో మొత్తం 19,965 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,02,45,741కి చేరింది. ప్రస్తుతం 1,92,308 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24గంటల్లో 7,80,835 కరోనా టెస్టులు చేయగా... ఇప్పటివరకూ చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 18,93,47,782కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 8,06,484 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.

ఫోటోలు: ఇంటి వద్దకే రేషన్ చేర్చే మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+