ప్రపంచ రికార్డు సాధించిన ఏపీకి చెందిన 17 నెలల చిన్నారి !

17 నెలల బుడ్డది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తన అద్బుత మేధస్సుతో ప్రపంచ రికార్డు సైతం సాధించింది. పిట్ట కొంచెం కూత ఘనం అనే రేంజ్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారి ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకి చెందిన వారు కావడం గమనార్హం. ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

ఒంగోలు పట్టణంలో అంబటి సాయికుమార్, ప్రణతి నివసిస్తున్నారు. వారికి ఖస్వి అనే ఒక కుమార్తె ఉంది. 17 నెలల వయస్సు ఉన్న ఈ చిన్నారి.. వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను స్పష్టంగా పలికి అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలిక ప్రతిభకు "నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ " లో స్థానం దక్కింది. గతంలో ఈ రికార్డు 4 సంవత్సరాల 3 నెలల వయసున్న చిన్నారి పేరిట ఉంది. ఆ బుడ్డది 300 పదాలు పలకగా.. ఇప్పుడు ఖస్వి అంత కన్నా తక్కువ వయస్సులో 2 రెట్లు ఎక్కువ పదాలను పలికి ఘనత సాధించింది.

17-month-old-baby-ambati-khasvi-from-ongole-create-world-record

అంబటి ఖశ్వి ఫ్రూట్స్, వెజిటబుల్స్, కలర్స్, యానిమల్స్, బర్డ్స్, డైలీ యూజ్ ఐటెమ్స్, బాడీ పార్ట్స్, వాహనాలు, ఆల్ఫాబెట్లు, నంబర్లు, రైమ్స్ వంటి విభాగాల్లో పదాలను పలుకుతుందని తెలుస్తోంది. కాగా ఈ ఘనతను గుర్తిస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఖశ్విని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారిలో ఉన్న మేధస్సు, ప్రతిభను ప్రశంసించారు. చిన్నారిని జిల్లాకు గర్వకారణంగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో ఇంతటి ప్రతిభను కనబరచడం అద్భుతం అని.. బాలికను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సైతం మెచ్చుకున్నారు. ఖశ్విని చూసి పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఆశీర్వదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+